ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 60 వేల థర్మాకోల్ పెట్టెలు దగ్ధం

by Naga Rani Yarlagadda |

ఏలూరు జిల్లా చేబ్రోలులోని ఓ థర్మాకోల్ పరిశ్రమ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 60 వేల థర్మాకోల్ పెట్టెలు దగ్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లా చేబ్రోలులోని ఓ థర్మాకోల్ పరిశ్రమ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున గోదాములో మంటలు చెలరేగగా.. అవి క్రమంగా, వేగంగా గోదామంతటా వ్యాపించాయి. దీంతో గోదాములో ఉంచిన 60 వేల థర్మాకోల్ పెట్టెలన్నీ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న భీమడోలు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు చెలరేగి.. బాక్సులన్నీ కాలిపోయి బూడిదయ్యాయి. ఆ సమయంలో లోపల కార్మికులు ఎవరూ లేకపోవడంతో.. పెను ప్రాణనష్టం తప్పిందని అధికారులంతా ఊపిరి పీల్చున్నారు.

ఏలూరు జిల్లా చేబ్రోలులోని థర్మాకోల్ పరిశ్రమ గోదాములో అగ్ని ప్రమాదం చేటుచేసుకుంది. తెల్లవారుజామున గోదాములో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో గోదాములో ఉంచిన 60 వేలకు పైగా థర్మాకోల్ పెట్టెలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న భీమడోలు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. థర్మాకోల్ అత్యంత సులభంగా మంటలు అంటుకునే పదార్థం కావడంతో, గోదాము నుంచి దట్టమైన పొగలు, ఆకాశాన్నంటేలా మంటలు ఎగసిపడ్డాయి.

Next Story