FIR Filed: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తికి బిగ్ షాక్.. సోదరుడిపై కేసు నమోదు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ (YCP) ముఖ్య నాయకులపై అన్ని జిల్లాల్లో వరుసగా కేసులు నమోదవుతున్నాయి.

FIR Filed: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తికి బిగ్ షాక్.. సోదరుడిపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ (YCP) ముఖ్య నాయకులపై అన్ని జిల్లాల్లో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. గత ఐదేళ్ల పాలనలో అక్రమాలు, దోపిడీలకు పాల్పడిన వారిపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. వారందరిపై విజిలెన్స్ (Vigilance), సీఐడీ ఎంక్వైరీ (CID Enquiry)లు వేసి నిజాలను నిగ్గు తేలుస్తున్నారు. అదేవిధంగా అప్పట్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆయన కుటుంబ కుటుంబంపై వైసీపీ (YCP) నేతలు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై అన్ని జిల్లాల్లోని టీడీపీ (TDP) నేతలు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తుండటంతో వారిపై వరుసగా కేసు నమోదు అవుతున్నాయి.

ఈ క్రమంలోనే అనంతపురం (Anantapur) జిల్లా రాప్తాడు (Rapthadu) మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి (Thopudurthi Prakash Reddy)కి బిగ్ షాక్ తగిలింది. తాజాగా, ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి (Chandrashekar Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో 2022 నవంబర్‌ నెలలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై 15 రోజుల క్రితం జిల్లా ఎస్పీ జగదీశ్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు తాజాగా చంద్రశేఖర్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

Next Story