పీఎంఏవై పథకం ద్వారా రూ.2.50లక్షల ఆర్థిక సాయం

by Thanuru Gopichand |

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద రూ.2.50లక్షలను ప్రభుత్వం అందిస్తోందని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghurama KrishnamRaju) తెలిపారు

పీఎంఏవై పథకం ద్వారా రూ.2.50లక్షల ఆర్థిక సాయం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద రూ.2.50లక్షలను ప్రభుత్వం అందిస్తోందని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghurama KrishnamRaju) తెలిపారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరూ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తద్వారా సొంతింటి నిర్మాణం చేసుకోవాలనుకునేవారు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం పొందాలన్నారు.

సొంత స్థలం, ప్రభుత్వం నుంచి పొందిన పట్టా స్థలంలో ఇల్లు నిర్మించుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన వారు తమ వివరాలను గ్రామ, మున్సిపల్ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రతిఒక్కరికి సొంతింటి కలను నెరవేర్చాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) సంకల్పానికి తమ వంతుగా సహకరించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్థిక సాయం చేస్తాయన్నారు. నవంబర్ 30 లోపల వివరాలను నమోదు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story