సీఎం చంద్రబాబుపై ఆర్థిక సంఘం చైర్మన్ ప్రశంసలు.. విజనరీ లీడర్ అంటూ కితాబు

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబు నాయుడు విజనరీపై 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా ప్రశంసలు కురిపించారు.

సీఎం చంద్రబాబుపై ఆర్థిక సంఘం చైర్మన్ ప్రశంసలు.. విజనరీ లీడర్ అంటూ కితాబు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) విజనరీపై 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా(Finance Commission Chairman Arvind Panagariya) ప్రశంసలు కురిపించారు. అమరావతి(Amaravati)లో సీఎం చంద్రబాబు నాయుడుతో 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. తెలిపారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని, రాష్ట్రాన్ని 2047 నాటికి సర్వాంధ్రప్రదేశ్‌గా మారేలా సీఎం ప్రణాళికలు రచిస్తున్నారని కితాబిచ్చారు. నీతి ఆయోగ్‌(NITI Aayog)లో ఉన్నప్పుడు చంద్రబాబుతో కలిసి తాను పని చేసినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా(Special Status) ఏ రాష్ట్రానికి ఇవ్వలడంలేదని, స్థానిక సంస్థలకు గ్రాంట్లు ఇవ్వడం కమిషన్ నిర్ణయిస్తుందని చెప్పారు. రాష్ట్రాల పర్యటన ముగిసిన తర్వాతే కేంద్ర పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచుతామని అరవింద్ పనగరియా తెలిపారు.

Next Story