- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు కొవ్వూరులో ఎక్స్ ప్రెస్ రైలు హాల్ట్
తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు స్టేషన్ లో (Kovvur Railway Station) ఎట్టకేలకు ఎక్స్ ప్రెస్ రైలు హాల్ట్ కు మార్గం సుగమం అయ్యింది.

దిశ, వెబ్ డెస్క్ : తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు స్టేషన్ లో (Kovvur Railway Station) ఎట్టకేలకు ఎక్స్ ప్రెస్ రైలు హాల్ట్ కు మార్గం సుగమం అయ్యింది. ఐదేళ్ల తొమ్మిది నెలల సుదీర్ఘ సమయం తరువాత ఇక్కడ ఎక్స్ ప్రెస్ రైలు ఆగనుంది. విశాఖ-కడప తిరుమల ఎక్స్ ప్రెస్ కు (Tirumala Express) హాల్ట్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం కొవ్వూరు స్టేషనులో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి (Purandheshwari) కార్యక్రమానికి హాజరై విశాఖ-కడప తిరుమల ఎక్స్ ప్రెస్ కు పచ్చ జెండాను ఊపారు. ఈ పరిణామం పట్ల కొవ్వూరుతో పాటు సమీప గ్రామాలవాసులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ ఎక్స్ ప్రెస్ ట్రైన్ల హాల్ట్ కోసం ఇక్కడి ప్రాంతవాసులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారన్నారు. 5 ఏండ్ల 9 నెలల విరామం అనంతరం కొవ్వూరు స్టేషన్ నుంచి ఎక్స్ ప్రెస్ రైలు సేవలు పునరుద్ధరణ జరిగాయన్నారు. నేటి నుంచే మచిలీపట్నం-విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు కూడా ఇక్కడ ఆపుతారన్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరి 6 నుంచి అనపర్తిలో విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కొవ్వూరు, అనపర్తిలో ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇచ్చినందుకు గానూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఎంపీ ధన్యవాదాలు తెలియజేశారు. గోదావరి పుష్కారాల విషయాన్ని ఉటంకిస్తూ.. కొవ్వూరు స్టేషన్ ను రూ.17 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తామన్నారు. పుష్కారాల ప్రారంభానికి ముందే పనులను పూర్తి చేసేలా చూస్తామన్నారు.






