DCM:‘సినిమాలు వేరు, రాజకీయాలు వేరు’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-26 09:10:27  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

DCM:‘సినిమాలు వేరు, రాజకీయాలు వేరు’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ(సోమవారం) చెన్నైలో జరుగుతున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ సెమినార్ లో ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు పీఎం మోడీ(PM Narendra Modi)నే అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

భారత్‌కు ఉన్న సామర్ధ్యం రీత్యా ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ఆచరణ సాధ్యమే అని తెలిపారు. ఈ క్రమంలో అవసరమైతే తమిళనాడు(Tamilnadu)లో ప్రచారం చేయడానికైనా తాను సిద్ధమేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవబోతుంది అని జోస్యం చెప్పారు. ఎన్డీయే కూటమి గెలుపు కోసం పనిచేయడానికి తానెప్పుడు సిద్ధంగా ఉంటానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని అన్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక, ఏపీలో వైసీపీ పై పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈవీఎంలపై వైసీపీకీ ఓ విధానం లేదని దుయ్యబట్టారు. ఈవీఎంల పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు సరియైనవి కాదని, 2019లో వైసీపీ గెలిచింది కూడా ఈవీఎంలతోనే అని చెప్పారు. సనాతన ధర్మం పై నిరంతరం దాడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దేశమే సనాతన ధర్మ భూమి అని వెల్లడించారు. మన దేశంలో రామాలయం లేని ఊరు లేదు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story
null