Tirumala News:శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు

by Jakkula.Mamatha |

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

Tirumala News:శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వేర్వేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ(Andhra Pradesh) మంత్రి రాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత బండ్ల గణేష్ తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల(Tirumala) శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మొదట వీరికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Next Story