- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న సినీ నటి
by Jakkula.Mamatha |
ఏపీ(Andhra Pradesh)లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు. ఈ తరుణంలో తిరుపతి జిల్లా(Tirupati District)లోని శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి(Srikalahastheeswara Temple) సినీ నటి పూజా హెగ్డే(Pooja Hegde) కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు(గురువారం) ఉదయం చేరుకున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు చేశారు. అనంతరం శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Next Story






