విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య.. అనంతరం మాట్లాడుతూ..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-27 10:42:07  IST  )

విజయవాడ దుర్గమ్మను సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు..

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య.. అనంతరం మాట్లాడుతూ..!
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ దుర్గమ్మ(Vijayawada Durgamma)ను సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Mla Nandamuri Balakrishna) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్యకు అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని బాలయ్యకు ఆలయ అర్చకులు అందజేశారు. అనంతరం కొంతసేపు ఆలయంలో కూర్చుకుని బాలకృష్ణ మొక్కులు కోరుకున్నారు.

ప్రతి సంవత్సరం మాదిరిగా దేవీ శరన్నవరాత్రులకు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శకుంటున్నారని, వారికి ఆలయ అధికారులు అన్ని సౌర్యాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని తాను కోరుకున్నానని తెలిపారు. రాష్ట్రభివృద్ధి, సంక్షేమం కోసం అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమ ప్రభుత్వంపై ఉండాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. అమ్మవారి శరన్నరాత్రి ఉత్సవాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారన్నారు.. అమ్మవారి కరుణ, కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు బాలకృష్ణ తెలిపారు.

Next Story