తిరుమల క్యూ లైన్‌లో గొడవ..బెల్ట్ తీసి భ‌క్తుడు వీరంగం..!

by velandi.Saikiran |   (  Updated:2026-03-02 17:51:26  IST  )

తిరుమల ఔటర్ రింగ్ రోడ్డు కృష్ణ తేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్లో భక్తుల‌ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Fight between devotees in Tirumala queue
X

Fight between devotees in Tirumala queue

దిశ‌, వెబ్ డెస్క్‌: తిరుమల ( Tirumala) శ్రీవారి సన్నిధిలో నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. తిరుమల కొండపైకి వచ్చిన భక్తులు రూల్స్ బ్రేక్ చేసి ఏదో ఒక తప్పిదం చేయడం ఈ మధ్య కామన్ అయిపోయింది. ముఖ్యంగా తిరుమల కొండపై రీల్స్ చేస్తూ సెలబ్రిటీల నుంచి సామాన్యులు రెచ్చిపోతున్నారు. టీటీడీ పాలకమండలి ఎన్నిసార్లు వార్నింగులు ఇచ్చినా కూడా భక్తులు తగ్గడం లేదు. అయితే లేటెస్ట్ గా తిరుమల కొండపై మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్న భక్తులు తన్నుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

తిరుమల శ్రీవారి క్యూ లైన్ లో గొడవ పెట్టుకున్న భక్తులు !

తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల తాకడి విపరీతంగా ఉంటుంది. ప్రతి రోజు 70, 000ల నుంచి లక్ష మంది భక్తుల వరకు దర్శించుకుంటూ ఉంటారు. అటు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కనీసం 6 గంటల నుంచి 10 గంటల సమయం పడుతుంది. ఒక్కోసారి 24 గంటలు కూడా పడుతుంది. పండ‌గ‌లు, సెల‌వులు ఉంటే, ద‌ర్శ‌నం కోసం ఒక్క రోజుకు మించి వేచి ఉండాల్సిందే. అయితే ఇలాంటి తరుణంలోనే తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్న భక్తులు, సహనం కోల్పోయి గొడవ పెట్టుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి కూడా చేసుకున్నారు.

తిరుమల ఔటర్ రింగ్ రోడ్డు కృష్ణ తేజ అతిథి భవనం సమీపంలోని క్యూ లైన్ లో ఉన్న భక్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. భక్తులు రెండు వర్గాలుగా చీలిపోయి గొడవ పెట్టుకున్నారు. ఈ తరుణంలోనే ఓ భక్తుడు తన బెల్ట్ తీసి మరి, ఓ వ్యక్తిని చితకబాదాడు. అయితే అక్కడే ఉన్న భద్రత సిబ్బంది, శ్రీవారి సేవకులు అలర్ట్ అయ్యారు. ఆ గొడవను ఆపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లి ఇలా కొట్టుకోవడం అవసరమా ? ఎవరో ఒకరు కాస్త ఓపిక పడితే సరిపోయేది కదా ? అంటున్నారు. జనాలకు కొంచెం కూడా ఓపిక లేదని ఫైర్ అవుతున్నారు.

క్యూలైన్ గొడవపై టీటీడీ కీలక ప్రకటన

తిరుమల శ్రీవారి సన్నిధి క్యూ లైన్ లో జరిగిన గొడవపై టీటీడీ పాలక మండలి ( TTD) స్పందించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా గొడవకు తెరదించడం ఏ మాత్రం సమంజసం కాదని సీరియస్ అయింది. ఓర్పు, సహనంతో వ్యవహరిస్తూ.. తోటి భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలని వెల్లడించింది. అదే సందర్భంగా క్యూ లైన్ నియమాలను కచ్చితంగా భక్తులు పాటించాల్సిందిగా కోరింది. రూల్స్ ఎవరు కూడా బ్రేక్ చేయకూడదని సూచనలు చేసింది టీటీడీ పాలకమండలి.

Next Story