రాష్ట్ర ప్రజలకు పండుగలాంటి వార్త.. రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

రాష్ట్ర ప్రజలకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తీపికబురు చెప్పారు.

రాష్ట్ర ప్రజలకు పండుగలాంటి వార్త.. రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తీపికబురు చెప్పారు. ఈ మేరకు విజయవాడ (Vijayawada)- సింగపూర్‌ (Singapore) మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీసును ప్రారంభించబోతున్నట్లుగా తెలిపారు. విజయవాడ నుంచి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ప్రయాణికులు అందుబాటులో ఉంటుందని అన్నారు. నవంబర్‌ 15 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని, విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌లోని ఛాంగీ విమానాశ్రయానికి చేరకోవచ్చని పేర్కొన్నారు. జులై 28న సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటనలో ఉన్న సమయంలో ఈ సర్వీసు విషయం ప్రస్తావనకు వచ్చినట్లు రామ్మోహన్‌ నాయుడు గుర్తు చేశారు. ప్రవాసాంధ్రుల సమావేశంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో ఈ సర్వీసును ఏర్పాటు చేశామన్నారు. స్వర్ణాంధ్ర 2047లో ప్రవాసాంధ్రుల పాత్ర అత్యంత కీలకమని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Next Story