- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారిని దర్శించుకున్న మహిళా క్రికెటర్ శ్రీచరణి
భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి (Sri Charani) తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి (Sri Charani) తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ (TTD) అధికారులు శ్రీచరణితో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపం వద్ద వేద పండితులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను శ్రీచరణి కుటుంబ సభ్యులకు అందజేసి సత్కరించారు. అయితే క్రికెటర్ శ్రీచరణి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు.
ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ 2025లో (World cup 2025) భారత మహిళా క్రికెట్ జట్టులో శ్రీచరణి కీలక పాత్ర పోషించారు. టోర్నీలో తొమ్మిది మ్యాచ్ లు ఆడి పద్నాలుగు వికెట్లను తీశారు. దీప్తి శర్మ తర్వాత అత్యదఇక వికెట్లు పడగొట్టిన బౌలరుగా నిలిచారు. ప్రపంచ కప్ గెలిచిన తరువాత తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.






