చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్

by velandi.Saikiran |

రంగంపేట పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళ కానిస్టేబుల్ ఆముదాల జయశాంతి తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు.

చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పోలీస్.. అంటేనే బాధ్య‌త‌, రెస్పెక్ట్. 24 గంటలు జనాల కోసం పనిచేసే అధికారి. పండుగ, ఎంజాయ్ అనే అంశాలను పక్కకు పెట్టి నిత్యం ప్రజల కోసం సేవ చేస్తారు. అయితే ఇందులో కొంతమంది పోలీసులు నిజాయితీగా పని చేస్తూ.. ప్రజల కోసం నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. సమాజాన్ని ముందుకు నడిపించేందుకు ధైర్య సాహసాలు కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో ఓ లేడీ కానిస్టేబుల్ తాజాగా చేసిన పని వైరల్ గా మారింది. చంటి బిడ్డను ఎత్తుకొని మరి, ట్రాఫిక్ క్లియర్ చేసింది. ఈ సంఘటన కాకినాడ జిల్లా సామర్లకోట రోడ్డుపై చోటుచేసుకుంది.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రంగంపేట పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళ కానిస్టేబుల్ ఆముదాల జయశాంతి తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా సామర్లకోట ఫ్లై ఓవర్ పైన శనివారం రాత్రి విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆమె రంగంలోకి దిగింది. తన బిడ్డను ఎత్తుకొని మరి ట్రాఫిక్ క్లియర్ చేశారు జయశాంతి. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ ఫిదా అయిపోతున్నారు. ఓ చంటి బిడ్డను ఎత్తుకొని మరి ఇలా ట్రాఫిక్ క్లియర్ చేయడం చాలా గ్రేట్ అంటున్నారు. మానవత్వానికి నిలువెత్తు నిర్దర్శనం ఈ మహిళా కానిస్టేబుల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story