- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. కన్న కూతురిపై తండ్రి లైంగికదాడి
రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు వెలుగు చూస్తుండడం అందరికీ తెలిసిందే. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకోవడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే.. ఆడపిల్లలకు బయటనే భద్రత లేదు అనుకుంటుంటే.. ఇంట్లో కూడా భద్రత లేకుండా పోయింది. పరిచయాస్తులే లైంగికదాడికి పాల్పడటాన్ని సమాజం ఈసడించుకోవాలి.
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాలనాగులా కాటేశాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని రాజమహేంద్రవరం (Rajamahendravaram) లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై తండ్రి పలుమార్లు లైంగికదాడి(sexual assault)కి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడుతున్న తండ్రి పై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్(Police Station)లో పోక్సో(POCSO) కేసు నమోదైంది.
అయితే.. 8వ తరగతి చదువుతున్న బాలిక(15) మంగళవారం డల్‌గా ఉండటంతో టీచర్ ఓదార్చుతూ ఏమైందని అడిగారు. దీంతో ఆ బాలిక కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ క్రమంలో తండ్రి రాక్షసకాండను ఆమె బయటపెట్టారు. కాగా.. విభేదాలతో బాధితురాలి తండ్రి వద్ద నుంచి తల్లి తన ముగ్గురు కుమార్తెలతో 8 ఏళ్ల కిందట పుట్టింటికి వెళ్లింది. దీంతో 3 ఏళ్లుగా పెద్ద కుమారై తండ్రి వద్ద ఉంటుండగా ఈ అఘాయిత్యం జరిగింది.






