- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy:పిడుగుపాటుకు తండ్రి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు
ఏపీ(Andhra Pradesh)లోని శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు తండ్రి మృతి చెందగా.. అతని కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళంలోని బలగ బుచ్చిపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. జిల్లా(Srikakulam District)లోని బలగ బుచ్చిపేటలో గేదేల రాజారావు(53), తన కుమారుడు నాగార్జున(23) ఇద్దరూ కలిసి నాగావళి నది తీరాన స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ తరుణంలో నది తీరాన స్నానం చేస్తుండగా పిడుగు పడింది. దీంతో తండ్రి రాజారావు తీవ్రంగా గాయపడగా.. రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. తండ్రి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






