- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటకలో ఘోర ప్రమాదం.. బొలేరో బోల్తా పడి నలుగురు ఏపీ కూలీల దుర్మరణం
చింతకాయలు కోయడానికి వెళ్లిన కూలీలను మృత్యువు వెంటాడింది. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లాకు చెందిన నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: చింతకాయలు కోయడానికి వెళ్లిన కూలీలను మృత్యువు వెంటాడింది. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లాకు చెందిన నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి కర్ణాటకలోని కోలార్ జిల్లా శ్రీనివాసపురం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
అదుపుతప్పి బోల్తా పడిన బొలేరో..
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం, రామసముద్రం మండలం చంబకూరు గ్రామానికి చెందిన సుమారు 20 మంది కూలీలు చింతకాయలు కోసే పనుల కోసం బొలేరో వాహనంలో కర్ణాటకకు వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా, శ్రీనివాసపురం వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, వాహనంలో ఉన్న మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.






