‘ప్రాణాలైన ఇస్తాం కానీ.. భూములివ్వం’.. రైతుల ఆందోళన

by Jakkula.Mamatha |

ఇండోసోల్ సోలార్ పరిశ్రమ భూసేకరణపై రైతులు రగిలిపోతున్నారు.

‘ప్రాణాలైన ఇస్తాం కానీ.. భూములివ్వం’.. రైతుల ఆందోళన
X

దిశ,వెబ్‌డెస్క్: ఇండోసోల్ సోలార్ పరిశ్రమ భూసేకరణపై రైతులు రగిలిపోతున్నారు. ప్రాణాలైనా ఇస్తాం, పొలాలు ఇవ్వబోమని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు కరేడు రైతులు, స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కరేడ్ గ్రామంలో 4,855 ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, పది రోజులుగా రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. తీరం వెంబడి ఉన్న సారవంతమైన భూములను ఇస్తే మేము రోడ్డున పడుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏటా 3 పంటలు, పచ్చని పొలాలు, సొంత ఇల్లు వదిలి ఎక్కడికెళ్లాలి అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో బంజరు భూములను పరిశ్రమకు కేటాయించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేసి.. సోలార్ యూనిట్ వద్దని రైతుల ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తోంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ప్రాజెక్టుకు 8300 ఎకరాల భూసేకరణ రైతులు ఆందోళనలను ప్రభుత్వం గౌరవించి.. ఈ కంపెనీని పంటలు అంతగా పండని ప్రాంతాలకి తరలించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Next Story