కూతురు, కొడుకుని కాడికి కట్టి పొలం దున్నిన రైతు

by Muthe.Rajitha |

ఓ రైతు తన కన్న బిడ్డలను కాడికి కట్టి పొలం దున్నిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

కూతురు, కొడుకుని కాడికి కట్టి పొలం దున్నిన రైతు
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ రైతు తన కన్న బిడ్డలను కాడికి కట్టి పొలం దున్నిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రికి చెందిన బండి రాజశేఖర్ రెడ్డి తన కూతురును, కొడుకును కాడికి కట్టి చేనులో దున్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనకున్న 3 ఎకరాల చేమంతి తోటలో కలుపు బాగా పెరగడంతో దానిని తొలగించేందుకు అధిక కూలీ డిమాండ్ చేయడంతో ఈ పని చేసినట్టు రైతు పేర్కొన్నాడు. అధిక కూలీలు చెల్లించలేక, ఉన్న చేనును వదిలేసుకోలేక బిడ్డలను కాడికి కట్టి కలుపు తొలగించినట్టు ఆవేదన చెందాడు. పంటకోత సమయానికి గిట్టుబాటు ధర ఉంటుందో లేదో అనే భయంతో ఇలా చేసినట్టు తెలిపాడు.

Next Story