రూ.3 లక్షలతో టమాటా సాగు.. కొండంత దుఃఖంతో పంటంతా పారబోసిన రైతు

by Naga Rani Yarlagadda |

ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షాల పాలవుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో పంటల కాపు మంచిగా వచ్చినా చీడ, మచ్చ రావడంతో రైతుకు నష్టమే వస్తోంది.

రూ.3 లక్షలతో టమాటా సాగు.. కొండంత దుఃఖంతో పంటంతా పారబోసిన రైతు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షాల పాలవుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో పంటల కాపు మంచిగా వచ్చినా చీడ, మచ్చ రావడంతో రైతుకు నష్టమే వస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో భాస్కర్ రెడ్డి అనే రైతు రెండు ఎకరాల్లో రూ.3 లక్షల పెట్టుబడితో టమాటా పంట సాగుచేశారు. కానీ.. వర్షాలు అధికంగా పడటంతో పంటంతా నల్లమచ్చ సోకింది. దాంతో పంటను ఎవరూ కొనరని.. కొండంత దుఃఖంతో ఏడు ట్రక్కుల టమాటాలను రోడ్డు పక్కన పారబోశారు. పంటకు తెగుళ్లు రాకపోయి ఉంటే.. టమాటాకు ఇప్పుడున్న ధర ప్రకారం తనకు రూ.3 లక్షలకు పైగానే ఆదాయం వచ్చేదని భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాలను తీరుస్తుందని గంపెడాశలతో ఎంతోకష్టపడి టమాటా సాగు చేస్తే.. చివరికి ఇలా జరిగిందని వాపోయారు.

Next Story