Pawan Kalyan :న్యూ లుక్కులో పవన్ అదుర్స్ అంటున్న అభిమానులు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-26 10:39:48  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) న్యూ లుక్(New Look) అదుర్స్ అంటున్నారు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు.

Pawan Kalyan :న్యూ లుక్కులో పవన్ అదుర్స్ అంటున్న అభిమానులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) న్యూ లుక్(New Look) అదుర్స్ అంటున్నారు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు. కాగా గురువారం రాజమహేంద్రవరం(Rajamahendravaram)లో జరిగిన 'అఖండ గోదావరి'(Akhanda Godavari) శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తోపాటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో పవన్ ఆయన గెటప్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఎప్పుడూ తెల్లటి లాల్చీ, పంచెలో కనిపించే పవన్.. నేడు మాత్రం ప్యాంటు, షర్టుతో అది కూడా ఇన్ షర్టుతో కనిపించేసరికి, ఆయన అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు వావ్ అనకుండా ఉండలేక పోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కొత్త లుక్ తో ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా పవన్ నటించిన 'హరిహారవీరమల్లు' జులై 24న థియేటర్లలోకి రానుంది.

Next Story