వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ కమెడియన్

by Jakkula.Mamatha |

జమ్మూకాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే

వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ కమెడియన్
X

దిశ,వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత్.. ఈ నెల(మే) 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రమూకలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో ఇండియా–పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశ రక్షణ నేపథ్యంలో భారత్ ఆర్మీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

అయితే.. దేశ రక్షణ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. ఇటీవల పాక్ కాల్పుల్లో మరణించిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటంబాన్ని పరామర్శించేందుకు ప్రముఖ కమెడియన్ శివారెడ్డి ఏపీ(Andhra Pradesh)లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని కళ్లితండా గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కమెడియన్ శివారెడ్డి(Comedian Shiva Reddy) వీర జవాన్ ఇంటికి వెళ్లారు. ఈ తరుణంలో మురళీ నాయక్ తల్లికి పాదాభివందనం చేశారు.

మురళీ నాయక్(Jawan Murali Nayak) ఇంటికి వెళ్లిన ఆయన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి.. ఓదార్చారు. మురళి నాయక్ ఫోటోకి పూల మాల వేసి దండం పెట్టుకున్నారు. ఆ తల్లిదండ్రుల దు:ఖాన్ని చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి వీరుడిని అందించారని మురళీ నాయక్ తల్లి కాళ్ళు మొక్కారు. మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే మురళీ వంటి జవాన్ల ప్రాణత్యాగమే కారణమని శివారెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story