- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే స్కూల్లో 600 మంది విద్యార్థినులకు అస్వస్థత.. ప్రిన్సిపల్, ANM సస్పెన్షన్
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల ఆశ్రమ పాఠశాల లో 600 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల ఆశ్రమ పాఠశాల(Kurupam Girls Ashram School)లో 600 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా.. పలువురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం విద్యార్థినులందరికి విశాఖ కేజీహెచ్(Visakha KGH)తో పాటు పలు ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నారు. పచ్చ కామెర్లతో విద్యార్థినులందరూ బాధపడుతున్నారు. దసరా సెలవులు తర్వాత తిరిగి వచ్చిన విద్యార్థినులకు జ్వరం, వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినుల రక్త నమూనాల ద్వారా పచ్చ కామెర్లు వచ్చినట్లు తేలింది.
కాగా పాఠశాలలో నీళ్లు తాగడం వల్లే అస్వస్థతకు గురైనట్లు నిర్దారణ అయింది. మంత్రి గుమ్మడి సుధారాణి విద్యార్థినులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. పాఠశాల ప్రిన్సిపల్ అనురాధతో పాటు ANMపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనపై కమిటీని ఏర్పాటు చేసింది. నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.






