- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ మద్యం కేసు.. చివరి రోజు కస్టడీలోకి జోగి రమేశ్ సోదరులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో నిందితులైన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు రామును ఎక్సైజ్ అధికారులు చివరి రోజు కస్టడీకి తీసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో నిందితులైన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు రామును ఎక్సైజ్ అధికారులు చివరి రోజు కస్టడీకి తీసుకున్నారు. ఈ మేరకు విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి నిందితులను తరలించారు. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులను ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. చివరి రోజు కావడంతో ఎక్సైజ్ పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జనార్ధన్‌రావు, జగన్మోహన్‌రావు సోదరులకు జోగి సోదరులు అండగా ఉండి సహాయసహకారాలు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కూడా ఎక్సైజ్‌శాఖ అధికారులు సేకరించారు. ఈ క్రమంలోనే వారిద్దర్నీ ఇటీవల అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా, ఈ రోజుతో వీరి కస్టడీ ముగియనుంది. విచారణలో ఎక్సైజ్ పోలీసులు ఎలాంటి వివరాలు సేకరిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.






