Fake Liquor Case: సిట్ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్

by Gantepaka Srikanth |

ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)లో సిట్ ఏర్పాటు చేసింది.

Fake Liquor Case: సిట్ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)లో సిట్ ఏర్పాటు చేసింది. ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు(Set up a SIT) చేసింది. సిట్ సభ్యులుగా రాహుల్ దేవ్ శర్మ, మల్లికా గార్గ్‌లతో పాటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి ఒకరిని నియమించారు. కాగా, ఇటీవలే నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్‌రావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు విజయవాడ ఎక్సైజ్‌ కోర్టు ఈనెల 17 వరకు రిమాండ్‌ విధించింది. శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్‌ పోలీసులు.. రహస్య ప్రదేశంలో శనివారం ఉదయం 4.30 వరకు విచారించారు. కొత్త ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాక కోర్టుకు తీసుకొచ్చారు.

Next Story