- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతి జిల్లాలో నకిలీ సీఐ హల్ చల్
తిరుపతి (Tirupati) జిల్లాలో ఓ నకిలీ సీఐ హల్ చల్ (Fake CI) చేసిన ఘటన వెలుగు చూసింది.

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి (Tirupati) జిల్లాలో ఓ నకిలీ సీఐ హల్ చల్ (Fake CI) చేసిన ఘటన వెలుగు చూసింది. ఏకంగా పోలీసు స్టేషనులోనే హంగామా చేయడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతని అసలు గుట్టు బయటపడింది. నిందితుడు గతంలో రెడ్ శాండిల్ కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. ఇక పోలీసుల వివరాల ప్రకారం తాను రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ సీఐగా పనిచేస్తున్నానంటూ శివయ్య అనే వ్యక్తి ప్రజలను బెదిరింపులు, సెటిల్‌మెంట్ల పేరుతో మోసం చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. అన్నమయ్య జిల్లాకు చెందిన శివయ్య పోలీసు అధికారిగా చలామణి అవుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజాగా చినగొట్టిగల్లు మండలం జంగావాండ్లపల్లిలో ఓ జంట మధ్య రాజీ కేసులో శివయ్య జోక్యం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే హంగామా సృష్టించాడన్నారు. తాను రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ సీఐనని చెప్పుకుంటూ అక్కడున్నవారిని బెదిరించాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే అతని ప్రవర్తన, మాటతీరుపై అనుమానం వచ్చిన స్థానిక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. విచారణలో శివయ్య నిజంగా సీఐ కాదని, నకిలీ అధికారి అని తేలిందన్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుడు అన్నమయ్య జిల్లా, కలకడ మండలం, పెద్దకమ్మపల్లి వాసిగా గుర్తించామన్నారు.
సీఐగా నటిస్తున్న శివయ్యపై గతంలో కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా కే.వి.పల్లి పోలీస్ స్టేషన్‌లో రెడ్ శాండిల్ కేసు నమోదై ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతను రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ సీఐగా చెప్పుకుంటూ గతంలో పలు సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నకిలీ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతనిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
అధికారులుగా నటించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎటువంటి సందేహాలున్నా పోలీసులను సంప్రదించాలని కోరారు. ఎవరైనా పోలీసుల పేరిట బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.






