- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నమ్మి అధికారం ఇస్తే.. ప్రజలనే వెన్నుపోటు పొడిచారు’: మంత్రి గొట్టిపాటి
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 4వ తేదీ నాటికి ఏడాది పూర్తి కానుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 4వ తేదీ నాటికి ఏడాది పూర్తి కానుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో పలు సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. అయితే.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాలను నిలిపివేశారు.
కూటమి ప్రభుత్వం ఇటీవల రేషన్ వ్యాన్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న వైసీపీ.. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ నేతలు వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ కూడా చేశారు. దీనిపై కూటమి మంత్రులు, టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తూ గత వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీ ఆవిష్కరిస్తున్న వెన్నుపోటు దినం పోస్టర్ పై తాజాగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు.
ఈ నెల(జూన్) 4వ తేదీన మాజీ సీఎం జగన్ వెన్నుపోటు నుంచి రాష్ట్రం విముక్తి పొందిన రోజు అని పేర్కొన్నారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. ఈ క్రమంలో నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలను మాజీ సీఎం వైఎస్ జగన్ వెన్నుపోటు పొడిచారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. గత వైసీపీ హయాంలో 26 దళిత పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. వ్యాపారులను తరిమేసి చిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. అంతేకాదు ఆస్తి కోసం తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచి గెంటేసింది ఎవరు? అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు.






