వివాహేతర సంబంధం.. మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

by Yella Dhawani Reddy |

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తప్పదారి పట్టడంతో పచ్చని సంసారాల్లో కలహాలు చోటు చేసుకుంటున్నాయి.

వివాహేతర సంబంధం.. మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తప్పదారి పట్టడంతో పచ్చని సంసారాల్లో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొందరు వారి భాగస్వామ్యుల ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకడటం లేదు. మరికొందరు అక్రమ సంబంధాల గురించి తెలుసుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వారికి బుద్ధిచెప్పిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. పాలకోడేరు మండలం మోగల్లు శివారు గుత్తులవారిపాలెంలో ఓ మహిళపై గ్రామస్థులు అమానుషంగా ప్రవర్తించారు.

వివాహేతర సంబంధం ఉందని మహిళను స్థంభానికి కట్టేసి కొట్టారు. వివరాల్లోకి వెళ్లితే.. గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి విజయలక్ష్మితో అక్రమసంబంధం పెట్టుకుని అత్తిలిలో నివాసం ఉంటున్నాడు. ఈ విషయం తెలిసిన సుబ్బారావు భార్య వారిని రెడ్‌ హ్యాండెడ్‌‌గా పట్టుకుంది. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి విజయలక్ష్మిని గుత్తులవారిపాలానికి తీసుకునివచ్చింది. వారంతా మంగళవారం రాత్రి నుంచి సదరు మహిళను చెట్టుకు కట్టేసి కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వారి నుంచి విజయలక్ష్మిని విడిపించారు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story