- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DCM:పవన్ కల్యాణ్ ఆదేశాలతో థియేటర్లలో విస్తృత తనిఖీలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో కాకినాడ థియేటర్‌లలో తనిఖీలు నిర్వహించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో కాకినాడ థియేటర్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కాకినాడ సినిమా రోడ్డులో చాణక్య చంద్రగుప్త థియేటర్ల వద్ద చేపట్టిన తనిఖీల్లో ఆర్‌డీవో, తహసీల్దార్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా పెద్దపూడి, కాజూలూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ , కాకినాడ రూరల్‌లో అధికారులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.
ఇవాళ(మంగళవారం) ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్ల నిర్వహణను పకడ్భందీగా చేపట్టి ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ క్రమంలో థియేటర్ల బంద్ అంశంతో పాటు, సినీ ఇండస్ట్రీ, థియేటర్ల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ సినిమ హల్ బంద్ ప్రకటన పై తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు.






