విశాఖ హార్బర్ లో పేలుడు.. ముగ్గురు మృతి

by Muthe.Rajitha |

ఏపీలోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్(Fishing Harbor) లో భారీ పేలుడు(Explosion) సంభవించింది.

విశాఖ హార్బర్ లో పేలుడు.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్(Fishing Harbor) లో భారీ పేలుడు(Explosion) సంభవించింది. హార్బర్ సమీపంలో సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి అక్కడ పని చేస్తున్న వారు దూరంగా ఎగిరి పడగా.. వారి శరీరాలు గుర్తు పట్టలేనంతగా నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే హార్బర్ కు సమీపంలోని ఆ స్క్రాప్ షాపులో ఈ ఘటన జరిగిందని, ప్రమాదానికి గల పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృత్ దేహాలను మార్చురీకి తరలించారు.

Next Story