- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ మద్యం తయారీ.. 10 మంది అరెస్ట్
నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతున్న 10 మందిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం(Fake alcohol) తయారు చేసి అమ్ముతున్న 10 మందిని ఎక్సైజ్ పోలీసులు(Excise Police) అదుపులోకి తీసుకున్న ఘటన అన్నమయ్య జిల్లా(Annamaya District) తంబళ్లపల్లె(Tamballapalle)లో జరిగింది. గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా మద్యం తయారు చేసి మద్యం షాపుల్లో విక్రయిస్తున్నారు. సమాచారం అందడంతో మద్యం తయారీ ఇంటిపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. మొత్తం1470 లీటర్ల నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. 421 బాక్సుల్లో 41 బాటిళ్ల చొప్పున నింపినట్లు గుర్తించారు. పట్టుకున్న సరేకు రూ.1.75 కోట్ల విలువ చేస్తున్నట్లు నిర్దారణ చేశారు.
‘‘బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. అడ్మిరల్ బ్రాందీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్సర్, సుమో బ్రాండ్ల పేరుతో అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ 13 మందిపై కేసు నమోదు చేశాం. 10 మందిని అరెస్ట్ చేశాం. మిగిలిన ముగ్గురి కోసం స్పెషల్ టీమ్ గాలిస్తున్నాయి. నిందితులు రాజు, జనార్ధన్ రావు దొరికితే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.’’ అని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.






