AP News:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు?

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-06 15:40:42  IST  )

గేమ్ చేంజర్(Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తూ ఇద్దరు అభిమానులు మ‌ర‌ణించిన విషయం తెలిసిందే.

AP News:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమ్ చేంజర్(Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తూ ఇద్దరు అభిమానులు మ‌ర‌ణించిన విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళితే.. శనివారం రోజు రాజమహేంద్రవరంలో జ‌రిగిన‌ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజ‌రై తిరిగి ఇంటికి వెళుతున్న స‌మ‌యంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ(23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయారు.

దాంతో మృతుల కుటుంబాల‌కు పవన్ కళ్యాణ్, హీరో రామ్ చరణ్(Ram Charn) రూ. 10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో మృతి చెందిన అభిమానుల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, హీరో రామ్ చ‌ర‌ణ్ ప‌రిహారం ప్ర‌క‌టించ‌డం పై మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ప‌రోక్షంగా విమ‌ర్శ‌ల‌ు గుప్పించారు. ఈ మేర‌కు ఆయ‌న ‘‘పుష్ప’ కేమో నీతులు చెప్తారా.. ‘గేమ్ చేంజర్’కు పాటించరా!’’ అంటూ ప‌వ‌న్‌ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More...

Pawan Kalyan: ‘ఓజీ’ సినిమా గురించి టాప్ సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్.. చర్చనీయాంశంగా మారిన ట్వీట్



Next Story