- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ అవగాహన రాహిత్యానికి ఈ ఒక్కమాటే నిదర్శనం : టీడీపీ నేత యనమల
by Naga Rani Yarlagadda |
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్.. రాజధానిపై పదే పదే విషం కక్కుతుంగడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్.. రాజధానిపై పదే పదే విషం కక్కుతుంగడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై అసంబద్ధమైన ప్రకటనలు, రకరకాల మాటలు చెప్తూ.. జగన్ నవ్వుల పాలవుతున్నారని అన్నారు. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదని జగన్ చెప్పడం.. ఆయనకెంత అవగాహన ఉందో తెలియజేస్తుందని, జగన్ కు ఉన్న అవగాహనారాహిత్యానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ప్రతీసారి అమరావతిపై ఆరోపణలు చేసి గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో చాలా రాజధానులు నదీతీరాల పక్కనే ఉన్నాయని, అవన్నీ అభివృద్ధి చెందడం జగన్ కు కనిపించలేదా అని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడమే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుందన్నారు.
Next Story






