‘ఎన్నికల్లో చాలా ఘోరంగా ఓడిపోయాం.. ఒప్పుకోవాల్సిందే’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-31 13:15:13  IST  )

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో గత ఏడాది(2024) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) టీడీపీ(TDP) కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

‘ఎన్నికల్లో  చాలా ఘోరంగా ఓడిపోయాం.. ఒప్పుకోవాల్సిందే’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో గత ఏడాది(2024) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) టీడీపీ(TDP) కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కూటమిగా ఏర్పడిన టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేన(Janasena) పార్టీలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలో వైసీపీ(YSRCP)కి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలే వచ్చాయి. దీంతో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఆ సమయంలో పలువురు వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పార్టీని కూడా వీడి అధికార టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) వైసీపీ(YSRCP) ఓటమి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ(YCP) తిరిగి అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Former CM Jaganmohan Reddy) మళ్లీ సీఎం(Chief Minister)గా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు.

కానీ.. మేము గత ఏడాది(2024) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం, ఘోరంగా ఓడిపోయాం అన్నారు. దారుణంగా ఓడిపోయామని ఒప్పుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ.. కూటమికి 164 సీట్లు ఎందుకు వచ్చాయో వారికే అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. ముగ్గురి కలయిక, వ్యతిరేకత వలనో ఇలా జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. ఏదేమైనా 175 అసెంబ్లీ(Assembly), 25 ఎంపీ(MP) స్థానాలు గెలిచేలా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పునర్నిర్మాణం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.

Next Story