మేం అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాలి: రోజా

by Ajay Maddhiboyina |

మాజీ మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలిలో గెలిచిన గెలినాకొడుకులు రాష్ట్రంలో ఎక్కువైపోయారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మేం అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాలి: రోజా
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలిలో గెలిచిన గెలినాకొడుకులు రాష్ట్రంలో ఎక్కువైపోయారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన, టీడీపీ నేతలు ఇప్పుడే హైదరాబాద్ పారిపోతున్నారని, అదే వైసీపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ కాదు అమెరికా పారిపోతారని అన్నారు. అప్పుడు వాళ్లను ఎవడూ కాపాడలేడు అంటూ హెచ్చరించారు. ఇప్పుడు టార్చర్ పెట్టినా కేసులు పెట్టినా దానికి వందరెట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరిపోయిందని ఎక్కడకు వెళ్లినా అక్కడే పుట్టానని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

పవన్ ఓ సినిమాలో నాకు కొంచెం తిక్క ఉంది దానికి ఓ లెక్క ఉందని డైలాగ్ చెప్పాడని... చంద్రబాబు బాబా లెక్క ఇస్తున్నట్టున్నాడు ఆ లెక్క ముదిరి ముదిరి పీక్స్‌కు వెళుతుందని ఆరోపించారు. అందరూ వీకెండ్‌కు కుటుంబాన్ని చూడ్డానికి సొంతూరుకు వెళతారని కానీ పవన్ వీకెండ్‌లో మాత్రమే ఏపీకి వస్తాడని అన్నారు. వారం మొత్తం షూటింగ్లు చూసుకుంటూ హైదరాబాద్ లో ఉంటాడని విమర్శించారు. టీటీడీ ఎస్వీ గోశాలలో అన్ని గోవులు చనిపోతే వాళ్లను శిక్షించకుండా వచ్చి చూడకుండా ఉన్న పవన్ కల్యాణ్ ఏం సనాతన యోధుడు అని ప్రశ్నించారు. శ్రీశైలంలో తాంబేళ్లు చనిపోయినా అక్కడకు కూడా వెళ్లడని కానీ తమిళనాడు వెళ్లి మాట్లాడతాడని మండిపడ్డారు.

Next Story