- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన కామెంట్స్
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరలో కలుపుతామని హామీ ఇచ్చారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరలో కలుపుతామని హామీ ఇచ్చారని అన్నారు. ప్రజలు గూడురు నెల్లూరులో ఉండాలని కోరుకుంటున్నారని, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత కలపుతామని చెప్పారన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు ఏదో చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు తన కులానికి చెందిన ఓ వ్యక్తి వల్లనే గూడూరును తిరుపతిలో ఉంచారని అన్నారు.
ఆ వ్యక్తి కొందరు వ్యక్తులతో కలిసి ఒత్తిడి తీసుకురావడం వల్లనే చంద్రబాబు గూడూరును తిరుపతిలో ఉంచారన్నారు. ప్రజల కంటే మీకు మీ కమ్యూనిటీవాళ్లే ఎక్కువ అయ్యారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మనసు మార్చుకుని గూడూరును నెల్లూరులో కలపాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గూడూరును నెల్లూరులో కలపకపోతే రాజకీయాల నుండి విరమించుకుంటానని అన్నారని ఆయన మాట మీద నిలబడాలి అన్నారు. చంద్రబాబు, లోకేష్ చొక్కా పట్టుకుని గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపేలా నిలదీయాలన్నారు. ప్రజలతో కలిసి రోడ్ల మీదకు వచ్చి పోరాడాలన్నారు.






