- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ముందస్తు బెయిల్
మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానికి ముందస్తు బెయిల్ మంజూరైంది.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానికి ముందస్తు బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న రావి వెంకటేశ్వరరావుకు చెందిన ఒక వస్త్ర దుకాణంపై జరిగిన దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని హైకోర్టును (ap high court) ఆశ్రయించారు. ఈ దరఖాస్తును పరిశీలించిన హైకోర్టు.. కింది స్థాయి కోర్టులో ష్యూరిటీ పత్రాలు సమర్పించాలని ఆదేశించడంతో, నాని గుడివాడ కోర్టుకు వెళ్లి ఆయా పత్రాలను సమర్పించగా.. గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. మంగళ, శనివారాల్లో గుడివాడ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని షరతు విధించింది.
ఎన్నికల ఫలితాల అనంతరం దాదాపు ఏడాది పాటు తన నియోజకవర్గానికి దూరంగా ఉన్న కొడాలి నాని, కోర్టు సంబంధిత పనిలో భాగంగా గుడివాడకు వచ్చిన సంగతి తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.






