- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రవీణ్ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్టుపై అనుమానాలు.. మాజీ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ మృతిపై లిబరేషన్ కాంగ్రెస్ తరపున కోర్టులో పిల్ వేస్తామని చెప్పారు. విజయ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్టులో స్పష్టత లేదని చెప్పారు. ట్రావెల్ చేసింది ఆగింది మద్యం కొనుగోలు చేసింది ఎక్కడ అనే విషయాలు నిరూపించలేదని అన్నారు. చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అని తప్ప పోలీసుల చూపించిన వీడియోలో అతను ప్రవీణ్ అని నిర్దారణ కాలేదన్నారు. తనకు ఎన్నో పోస్టుమార్టం రిపోర్టులు చూసిన అనుభవం ఉందని, మద్యం తాగటం వల్లే చనిపోయాడని పోస్టుమార్టంలో కావాలని రాసినట్టు ఉందన్నారు.
ప్రిలిమినరీ రిపోర్టులో ఆల్కహాల్ లేదని చెప్పిన డాక్టర్లు ఫైనల్ రిపోర్టులో ఆల్కహాల్ ఉందని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఆల్కహాల్ గురించే ఎందుకు ఇంతగా ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు మొదట ప్రెస్‌మీట్‌లో ఎక్కడా ఆల్కహాల్ గురించి లేదని తరవాత ఒక స్టోరీ అల్లడం కోసం ఆల్కహాల్‌ను వాడుకున్నారని అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ముఖం రాళ్లకు తాకడం వల్ల గాయాలయ్యాయని చెప్పారని మరి తల వెనుకభాగంలో ఎలా గాయం అయ్యిందని ప్రశ్నించారు. చాలా అనుమానాలకు అసలు సమాధానాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని , ఈ నేపథ్యంలో ప్రవీణ్ ది హత్యే అనే అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనపై అందరినీ కలుపుకుని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని అన్నారు.






