AP High Court: మాజీ సీఎం జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా

by Jakkula.Mamatha |

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు(High Court)లో ఇవాళ(బుధవారం) విచారణ జరిగింది.

AP High Court: మాజీ సీఎం జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు(High Court)లో ఇవాళ(బుధవారం) విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు(AP High Court) వాయిదా వేసింది. మాజీ సీఎం జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని మంత్రి నారాయణ(Minister Narayana) తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా(Advocate Siddharth Luthra) కోర్టును కోరారు.

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్(YS Jagan) తరపు న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్(Former Advocate General Sriram) తన వాదనలు వినిపిస్తూ వరుసగా విచారణకు సమయం అడుగుతున్నారన్నారు. ఈ పిటిషన్ పై రెగ్యులర్ విచారణ జరపాలని ఆయన కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను మూడు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. అసలు ఈ కేసు వివరాలు ఏంటంటే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల వెనుక అప్పటి మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ పాత్ర ఉందంటూ ఒక పత్రికలో కథనాలు వచ్చాయి.

సదరు పత్రిక కథనాలతో తన పరువుకు భంగం వాటిల్లిందని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి నారాయణ(Minister Ponguru Narayana) పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఆ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం జగన్ కు కోర్టు పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణకు వైఎస్ జగన్(YS Jagan) కోర్టుకు హాజరు కాలేదు. ఆ తర్వాత కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్(Quash Petition) దాఖలు చేయడం జరిగింది.

Next Story