- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్.. 31నే నగదు అందజేత
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధమవుతోంది....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పెన్షన్ల(Pensions) పంపిణీకి సర్వం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం(Kutami Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటవ తేదీనే లబ్ధిదారుల(Distribution)కు రూ. 4 వేలు అందజేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆయా నియోజకవర్గాల్లో పెన్షన్ లబ్దిదారులకు వద్దకే వెళ్లి ఎమ్మెల్యేలు, అధికారులు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈసారి ఒక రోజు ముందే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం వస్తుండటంతో జనవరి 31న శనివారం రోజునే పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం 62.94 లక్షల మందికి పెన్షన్ల కోసం ఇప్పటికే రూ.2,731 కోట్లు నిధులు విడుదల చేశారు. ఇక పంపిణీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) కూడా లబ్ధిదారులకు పెన్షన్ అందించనున్నారు.






