- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ కోసం నా ఆస్తులు అమ్ముకున్నా.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
35 ఏళ్లుగా నమ్ముకున్న బీజేపీ (BJP) పార్టీ కోసం తన సొంత ఆస్తులు అమ్ముకున్నానని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Varma) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: 35 ఏళ్లుగా నమ్ముకున్న బీజేపీ (BJP) పార్టీ కోసం తన సొంత ఆస్తులు అమ్ముకున్నానని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Varma) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజుల్లో డబ్బులు లేకుండా ఏ ఎన్నికలు జరగడం లేదని అన్నారు. ఆనాటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ మీటింగ్.. చిన్నదైనా, పెద్దదైనా అది పశ్చిమ గోదావరి జిల్లాలోనే చేయాలని, అది కూడా భీమవరం (Bhimavaram)లోనే చేస్తారనే పేరుందని అన్నారు. తన ఎంటైర్ పొలిటికల్ లైఫ్‌లో ఎవరినీ ఒక్క రూపాయి చందా అడగలేనది.. అందుకు తన మనసు అంగీకరించదని తెలిపారు. ఈ రోజల్లో సొంత డబ్బులు పెట్టి రాజకీయం చేసే నాయకులు ఎవరున్నారు.. ఎందరున్నారో చెప్పాలన్నారు. తాను ఎల్లప్పుడూ పార్టీ సిద్ధాంతాన్నే నమ్ముకునే కష్టపడి పని చేశానని.. పదవుల కోసం పాకులాడలేదని భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.






