Vice Chanceller: ఇంగ్లిష్​ రాని వాళ్లూ నాడు వీసీలే..

by Thanuru Gopichand |   (  Updated:2025-03-04 09:51:38  IST  )

వైసీపీ హయాంలో ఇంగ్లీషు రానివారిని వీసీలుగా నియమించారు. రాజారెడ్డి చెల్లెలి కోడలిని వీసీగా నియమించారని విద్య ,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ఆ రోపించారు.

Vice Chanceller: ఇంగ్లిష్​ రాని వాళ్లూ నాడు వీసీలే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ హయాంలో ఇంగ్లీషు రానివారిని వీసీలుగా నియమించారు. రాజారెడ్డి చెల్లెలి కోడలిని వీసీగా నియమించారని విద్య ,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా వీసీల నియామకం చేపట్టామని, బెదిరించారనే పదం ఎక్కడుందో చూపించాలని సవాల్ చేశారు. వీసీల రాజీనామా అంశంలో వైసీపీ సభ్యుల ఆరోపణలపై శాసనమండలిలో మంత్రి సమాధానం ఇచ్చారు. 15 మంది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారనే అంశంపై ఆధారాలు, వీడియోలు సభ ముందు పెడుతున్నామని, దీనిపై విచారణ జరిపించాలని మండలి వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) డిమాండ్ చేశారు. దీనిపై లోకేశ్​స్పందిస్తూ.. వైసీపీ సభ్యుల ఆరోపణలను తిప్పికొట్టారు. టీడీపీకి, ప్రభుత్వానికి సంబంధించిన వారు బెదిరించి వీసీలను రాజీనామా చేయించారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. నా వద్ద ఆధారాలు ఉన్నాయి. మొత్తం 17 మంది రాజీనామా చేస్తే 10 మంది పర్సనల్, నో రీజన్స్ తో రాజీనామా చేశారు. అందుకు సంబంధించిన లేఖలు నా వద్ద ఉన్నాయి. ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్లు ఇచ్చారు. ఐదుగురు ఓరల్ ఇన్ స్ట్రక్షన్స్ వచ్చాయి, అందుకే రాజీనామా చేశామన్నారు. బెదిరించారు, పలానా వ్యక్తులు ఫోన్ చేశారు, నిరసనగా, బయటకు వెళ్లమన్నారని, అందుకే రాజీనామా చేశారని ఎవరూ చెప్పలేదు.. అని వివరించారు.

గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్జీయూకేలో రామచంద్రరాజు ఈ విధంగానే రాజీనామా చేశారు. రాయలసీమ యూనివర్సిటీకి (University) సంబంధించిన ప్రసాదరావు, కృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించి రెహ్మతుల్లా, ద్రవిడ యూనివర్సిటీకి సంబంధించి సుధాకర్ , వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి రాజేంద్రప్రసాద్ కూడా ఈ విధంగానే రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పిస్తాను. 21-07-2019న ద్రవిడయన్ యూనివర్సిటీ వీసీ విషయంలో వైకాపా నేతలు ఏ విధంగా వ్యవహరించారో మనం చూశాం. ఇలా చాలా ఆధారాలు ఉన్నాయి. దీనిపై ప్రివిలేజ్ మోషన్ పాస్ చేయాలనుకున్నాం. దీనిని సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాం.

బెదిరించాం, భయపెట్టించాం.. అందుకే రాజీనామాలు చేశారని వైసీపీ సభ్యులు మాట్లాడారు. వారిచ్చిన రాజీనామా లేఖలో ఎక్కడా బెదిరించారని, భయపెట్టారని లేదు. కొత్త టీంకు అవకాశమివ్వాలని ఒకరిద్దరు కోరారు. ప్రసాద్ రెడ్డి కి ఏ అర్హతతో ఇచ్చారు. యూనివర్సిటీలో సీఎం పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారా? కూటమి ప్రభుత్వంలో వీసీ నియామకాలను పారదర్శకంగా చేశాం. కేజీ నుంచి పీజీ వరకు సంస్కరణలు తీసుకువస్తున్నాం. వైసీపీ హయాంలో 117 జీవో తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల నుంచి 12 లక్షల మంది విద్యార్థులను దూరం చేశారు. చిక్కీ టెండర్లలో 36 శాతం రేట్లు తగ్గించాం. స్కూల్ కిట్స్ లో 10శాతం, గుడ్ల ధరలు తగ్గించాం. వీటన్నింటిపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. బెదిరించాం అనే పదం వాడారు. ఆ లేఖల్లో ఎక్కడా బెదిరించారని లేదు. ప్రివిలేజ్ మోషన్ కు అనుమతించాలి అని కోరారు..

Next Story