అమర జవాన్ మురళీనాయక్ గొప్ప మనసు.. తల్లిదండ్రులకు కూడా తెలియకుండా!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-20 04:44:25  IST  )

దేశ రక్షణ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ సరిహద్దులో వీరజవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

అమర జవాన్ మురళీనాయక్ గొప్ప మనసు.. తల్లిదండ్రులకు కూడా తెలియకుండా!?
X

దిశ,వెబ్‌డెస్క్: దేశ రక్షణ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ సరిహద్దులో వీరజవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఇటీవల భారత్–పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ పై మెరుపుదాడి నిర్వహించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో వీరమరణం పొందిన ఏపీ(Andhra Pradesh)లోని శ్రీసత్యసాయి జిల్లాలోని కళ్లితండా గ్రామానికి చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ తాను చేసిన సాయాన్ని కుటుంబ సభ్యులకు సైతం చెప్పలేదు. వివరాల్లోకి వెళితే.. చేసిన సాయం చెప్పుకోకూడదు అంటారు.

అలాగే తాను చేసిన సాయం గురించి అమర జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్(Murali Nayak) కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. గౌతమ్ కృష్ణ ‘సోలోబాయ్’ మూవీ ఈవెంట్‌లో మురళీనాయక్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ తరుణంలో ఈ విషయాన్ని తండ్రి శ్రీరామ్ నాయక్ వెల్లడించారు. ‘‘నా కొడుకు శ్రీ సత్యసాయి జిల్లాలోని అనాథల కోసం జీతం నుంచి నెలకు రూ.10వేలు పంపేవాడంట. అతను చనిపోయాకే మాకు ఆ విషయం తెలిసింది. మాకు ఎంతో గర్వంగా ఉంది’’ అని మురళీ నాయక్ తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Next Story