ప్రభుత్వ నిర్ణయంపై ఈయూ తీవ్ర ఆగ్రహం.. అడ్డుకుంటామని వార్నింగ్

by Vemula.Srinu Prasad |

ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు..

ప్రభుత్వ నిర్ణయంపై ఈయూ తీవ్ర ఆగ్రహం.. అడ్డుకుంటామని వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణ(APSRTC Privatization)పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని ఎంప్లాయిస్ యూనియన్(Employees Union) నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎలక్ట్రికల్ బస్సులను సైతం ఆర్టీసీనే నిర్వహించాలని, ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వొద్దన్నారు. సోమవారం కలెక్టర్లకు మెమోరాండం ఇస్తామని ఇస్తామని తెలిపారు. ఆర్టీసీలో 10 వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని రక్షించేందుకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ఈ నెల 26న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, ఆ భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు దామోదరరావు, నర్సయ్య స్పష్టం చేశారు.

Next Story