పవన్​ను కలిసిన డాక్టర్ ఏలూరి.. ఎందుకంటే....!

by Vemula.Srinu Prasad |

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను బుధవారం సాయంత్రం ఎస్సార్సీ లేబోరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. .

పవన్​ను కలిసిన డాక్టర్ ఏలూరి.. ఎందుకంటే....!
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఎస్సార్సీ లేబోరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి పలు అంశాలపై చేసిన విశ్లేషణ పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఫార్మా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై, ముఖ్యంగా నూతన డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఆవశ్యకతపై పవన్‌తో చర్చించినట్లు డాక్టర్ ఏలూరి తెలిపారు. కరోనా సమయంలో డాక్టర్ ఏలూరి ఆధ్వర్యంలో ప్రజలకు అందించిన సేవలను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొనియాడారు.

Next Story