తిరుమల కాంటీన్లకు ఈవోఐ గడువుల్లో మార్పులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-14 15:45:03  IST  )

తిరుమల కాంటీన్లకు ఈవోఐ గడువుల్లో మార్పు చేశారు..

తిరుమల కాంటీన్లకు ఈవోఐ గడువుల్లో మార్పులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల 5 పెద్ద కాంటీన్లు, 5 జనతా కాంటీన్ల కేటాయింపుల కోసం టీటీడీ ఆహ్వానించిన ఈవోఐ పత్రాల జారీ, సమర్పణ, పరిశీలనకు సంబంధించిన తేదీలను పరిపాలనా కారణాల వల్ల మార్పు చేశారు.

పెద్ద కాంటీన్లకు:

పత్రాల డౌన్‌లోడ్ ముగింపు తేదీ: 15-07-2025 నుంచి 26-07-2025 సాయంత్రం 5 గంటలకు మార్చారు.

ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ: 17-07-2025 నుంచి 28-07-2025 ఉదయం 11 గంటలకు మార్పు చేశారు.

పత్రాల తెరిచే తేదీ:

17-07-2025 నుండి 28-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్చారు.

జనతా కాంటీన్లకు:

పత్రాల డౌన్‌లోడ్ ముగింపు తేదీ: 17-07-2025 నుండి 28-07-2025 సాయంత్రం 5 గంటలకు మార్పు చేశారు..

ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ: 19-07-2025 నుండి 30-07-2025 ఉదయం 11 గంటలకు మార్పినట్లు తెలిపారు.

పత్రాల తెరిచే తేదీ:

19-07-2025 నుంచి 30-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్పు చేేసినట్లు అధికారులు తెలిపారు.. ఆసక్తి గల దరఖాస్తుదారులు మారిన తేదీలను గమనించాలని, ఈ మేరకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story