- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏనుగుల బీభత్సం... అరటి, బొప్పాయి పంటలపై దాడి
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మడిలక్ష్మీపురం మండలం దాదుపురంలో ఏనుగుల గుంపు అలజడి సృష్టించింది....

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా(Parvati Puram Manyam District)లో ఏనుగుల బెడద ఎక్కువ అయింది. అటవీ ప్రాంతం నుంచి తరచూ పంట పొలాల్లోకి వస్తున్నాయి. ఇష్టమొచ్చినట్లు పంటలపై దాడి చేస్తున్నాయి. అడ్డుకోబోయిన రైతుల(Farmers)పైనా దాడులు చేస్తున్నాయి. ఇలా పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా ఘటనలు జరిగాయి. అయినా ఏనుగుల సంచారాన్ని నిలువరించలేకపోతున్నారు. తాజాగా కూడామరో ఘటన జరిగింది. దీంతో మన్యం జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికైనా ఏనుగుల నుంచి తమను, తమ పంట పొలాలను రక్షించండని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ఏనుగుల నుంచి తమను, తమ పంట పొలాలను రక్షించాలని వేడుకుంటున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మడిలక్ష్మీపురం(Gummadilakshmipuram) మండలం దాదుపురంలో ఏనుగుల గుంపు అలజడి సృష్టించింది. స్థానిక అడవుల్లో నుంచి మంగళవారం ఉదయం గుమ్మడిలక్ష్మీపురం() పంట పొలాల్లోకి వచ్చాయి. అంతటిఆగకుండా రైతుల రేకుల షెడ్డులు, అరటి, బొప్పాయి పంటలపై దాడి చేశాయి. దీంతో పొలం పనులకు వెళ్లాలంటే రైతులు వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. ప్రజలకు అలర్ట్ ప్రకటించారు. ఏనుగులను అడవుల్లోకి తరిమేవరకూ పొలాలకు వెళ్లొద్దని సూచించారు. ఏనుగులను పంపేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.






