- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలిసారి గ్రామంలో విద్యుత్ వెలుగులు.. ఆనందంలో నృత్యం చేసిన గిరిజనులు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79ఏళ్లైనా ఇప్పటి వరకు కరెంట్ అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79ఏళ్లైనా ఇప్పటి వరకు కరెంట్ అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఫారెస్ట్ అనుమతులు ఇతర సాకులు చెబుతూ చాలా గ్రామాలకు రోడ్లు, విద్యుత్ వసతులు కల్పించకపోవడంతో ఇంకా చీకటిలోనే ఆ గ్రామాలు మగ్గిపోతున్నాయి. అలాంటి గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామం కూడా ఒకటి. అయితే తాజాగా ఆ గ్రామానికి విద్యుత్ వెలుగులు వచ్చాయి. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలోని గిరిజనులు అంతా ఎంతో ఆనందపడ్డారు. ఈ క్రమంలోనే ఆ గ్రామస్థులు తమ గిరిజన ఆచారంలోని థింసా నృత్యం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలోనే కాకుండా వారి ముఖాల్లోనూ వెలుగులు కనిపించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో మిగితా గిరిజన గ్రామాలకు కూడా కరెంట్ అందించాలని నెటిజన్లు కోరుతున్నారు. వీడియో






