మరో ఉద్యమం ఉధృతం.. 15 నుంచి నిరసనలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది...

మరో ఉద్యమం ఉధృతం.. 15 నుంచి నిరసనలు
X

దిశ, వెబ్ డెస్క్: విద్యుత్ ఉద్యోగులు(Electricity Employees) ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ర్టవ్యాప్తంగా ధర్నాలు(Dharnas), నిరసనల(Protests)కు పిలుపునిచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం వచ్చే నెల 15 నుంచి నిరసనలు వ్యక్తం చేయనున్నట్లు ట్రాన్స్ కో, జెన్కో, విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కాగా మే నెలలో విద్యుత్ ఇంజినీర్లు గత సమ్మెకు పిలుపునిచ్చారు. దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం చర్చలు జరపడంతో సమ్మెను విరమించుకున్నారు. అయితే జులైన నెలలో విద్యుత్ కార్మికులు ఆందోళనకు దిగారు. చలో విజయవాడ చేపట్టారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలకు పని చేస్తున్నామని, వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపడంతో ఆందోళనను విరమింపజేశారు. తాజాగా విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల జేఏసీ నిరసనలకు పిలుపునిచ్చింది. మరి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Next Story