- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ ఉద్యోగుల ఉద్యమం ఉధృతం.. భారీ ధర్నాకు పిలుపు
by Vemula.Srinu Prasad |
విజయవాడలో ధర్నాకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది..

X
దిశ, వెబ్ డెస్క్: తమ సమస్యలు పరిష్కారించాలని విద్యుత్ ఉద్యోగులు(Electrical workers) డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఉద్యోగుల జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సమ్మె(Strike)కు పిలుపునిచ్చింది. రెండేళ్లుగా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించింది. విజయవాడ(Vijayawada)లో సోమవారం భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో సమ్మెకు దిగుతామని స్పష్టం చేసింది. ఎస్మా ప్రయోగించినా తమ సమ్మె కొనసాగుతుందని తెలిపింది. తాము సమ్మెకు దిగితే విద్యుత్ సమస్యలు తలెత్తుతాయని, వీటికి ప్రభుత్వానిదే బాధ్యత అని విద్యుత్ ఉద్యోగుల JAC హెచ్చరించింది.
Next Story






