ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు.. యూనిట్‌కు ఎంతంటే..

by Naga Rani Yarlagadda |

ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వం ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించనున్నట్లు ప్రకటించింది.

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు.. యూనిట్‌కు ఎంతంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వం ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించనున్నట్లు ప్రకటించింది. గత వైసీపీ ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేసిన రూ.923.55 కోట్లను మినహాయించనున్నట్లు తెలిపింది. దీనివల్ల ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకూ.. ఏడాది పాటు ప్రజలకు విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం కలగనుంది. ఈ మేరకు APERC ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రూ అప్ ఛార్జీల ప్లేసులో ట్రూ డౌన్ ఛార్జీలను పరిచయం చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కు డిస్కంలు రూ.2,758.76 కోట్లకు ట్రూఅప్ చార్జీలకు దాఖలు చేయగా.. APERC రూ.1863.64 కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపింది. డిస్కంలు ప్రజల నుంచి రూ.2787 కోట్లు వసూలు చేయగా.. అందులో నుంచి రూ.1863.64 కోట్లను మినహాయించి.. అదనంగా వసూలు చేసిన రూ.923.55 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. వినియోగదారులకు యూనిట్ కు 13 పైసలు చొప్పున లబ్ధి చేకూరనుంది.

Next Story